రిటర్మెంట్ సమయం వచ్చింది..అమితాబ్ - MicTv.in - Telugu News
mictv telugu

రిటర్మెంట్ సమయం వచ్చింది..అమితాబ్

November 28, 2019

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సంచలన పోస్ట్ చేశారు. సినిమాల నుంచి తాను రిటైర్ కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘మనసు ఉత్సాహపడుతున్నా శరీరం సహకరించడం లేదు. మెదడు ఒకటి ఆలోచిస్తోంది, చేతి వేళ్లు మరొక సందేశాన్నిస్తున్నాయి. బహుశా నేను రిటైర్ కావాలని పరోక్షంగా అవి తెలియజేస్తున్నాయి అనుకుంటా’ అంటూ తన అధికారిక బ్లాగ్‌లో పోస్ట్ చేశారు.

 

తాజాగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్‌లో భాగంగా అమితాబ్ మనాలీ వెళ్లారు. అక్కడ హోటల్ నుంచి కారులో సెట్స్‌కు వెళ్తున్న సమయంలో ఈ రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందన్నారు. సినిమాలతో ఆయనది 50 ఏళ్ళ అనుబంధం. ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా క్షయ వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి చికిత్స పొందుతున్నప్పటికీ వయసు రీత్యా ఒక్కోసారి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవలే అనారోగ్యంతో కొన్నాళ్లు ఆసుపత్రిలో గడిపారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినప్పటికీ డిశ్చార్జి అయిన రెండు రోజులకే ఆయన సెట్స్‌కు వెళ్లిపోయారు. 

Amitabh Bachchan..