అభిమానులారా నన్ను క్షమించండి.. అమితాబ్  - MicTv.in - Telugu News
mictv telugu

అభిమానులారా నన్ను క్షమించండి.. అమితాబ్ 

October 21, 2019

Amitabh Bachchan  .

గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేక బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రతీ ఆదివారం తన ఇంటికి భారీగా వచ్చే అభిమానులను పలకరిస్తారు. ఆయన ఆస్పత్రిలో వుండటంతో అది వాయిదా పడింది. ఈ క్రమంలో అమితాబ్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. 

 తాజాగా నిన్న భారీ సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటివద్దకు వచ్చారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా అభిమానులు అలాగే రోడ్డుపై నిలబడి అమితాబ్‌ కోసం ఎదురు చూశారు. అయితే అమితాబ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో అమితాబ్‌ అభిమానులను కలవలేకపోయారు. తనని చూసేందుకు వచ్చిన అభిమానుల నిరాశను పసిగట్టారు ఆయన. తన ఇంటిముందు నిల్చున్న వారి ఫోటోలను సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. ‘సండే మీట్‌లో భాగంగా నన్ను కలిసేందుకు ఎందరో అభిమానులు నా నివాసం వద్దకు వచ్చారు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. అందుకే అభిమానులను కలవడం కుదరలేదు. నన్ను మన్నించండి’ అని అమితాబ్‌ ట్వీట్ చేశారు. కాగా, అమితాబ్ తాజాగా తెలుగులో నటించిన ‘సైరా’ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. హిందీలో ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు.