దావూద్ తో అమితాబ్ ఫోటో... అభిషేక్ క్లారిటీ ఇది - MicTv.in - Telugu News
mictv telugu

దావూద్ తో అమితాబ్ ఫోటో… అభిషేక్ క్లారిటీ ఇది

September 20, 2020

bcn

గత కొన్ని రోజులుగా నెటిజన్లు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అతని కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అమితాబ్ అతడి తనయుడు నటుడు అభిషేక్‌లను ట్యాగ్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అమితాబ్ బచ్చన్ ఓ వ్యక్తితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ‘అమితాబ్ బచ్చన్‌ను అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీంతో చూడవచ్చు’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీంతో అలర్ట్ అయిన అభిషేక్… ‘బ్రదర్ ఈ ఫొటోలో మా నాన్నతో పాటు ఉన్నవారు మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు. దీంతో ఆ వ్యక్తి ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై అమితాబ్ భార్య, ఎంపీ జయా బచ్చన్ స్పందించారు. సినిమా ఇండస్ట్రీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.