అమితాబ్ బిగ్ హార్ట్.. లక్ష కుటుంబాలకు ఆహారం - MicTv.in - Telugu News
mictv telugu

అమితాబ్ బిగ్ హార్ట్.. లక్ష కుటుంబాలకు ఆహారం

April 6, 2020

Amitabh Bachchan To Provide Ration To 1 Lakh Daily Wage Workers In Film Industry

కష్టకాలంలో ఆదుకోవడానికి మేమున్నాం అని సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్ కరణంగా పేదల బతుకులు చితికిపోయాయి. వారిని ఆదుకోవడానికి చాలామంది ముందుకువస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తన వంతుగా లక్ష కుటుంబాలకు సాయం చేస్తానని ప్రకటించారు. ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫెడరేషన్‌లో సభ్యులుగా ఉన్న లక్షమంది దినసరి సినీ కార్మికుల కుటుంబాలకు నెలవారీ రేషన్‌ను అందిస్తామని తెలిపారు. 


మేముసైతం మీకు తోడుగా చేయి కలుపుతాం అని అమితాబ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్, కల్యాణ్ జ్యువెల్లర్స్ అండగా నిలుస్తున్నాయి. ఈ విషయాన్ని సోనీ పిక్చర్స్ నెట్‌‌వర్క్ ధ్రువీకరించింది. లక్ష మంది ఫిల్మ్, టెలివిజన్ కార్మికుల కుటుంబాలకు సాయం చేస్తామని వెల్లడించింది. తమ సంస్థ తరఫున కనీసం యాభై వేల మంది కార్మికులు, వారి కుటుంబాలకు ఒక నెల సరుకులు అందజేస్తామని సోనీ పిక్చర్స్ సంస్థ సీఈవో ఎన్పీ సింగ్ చెప్పారు. కాగా, వారికి ఎప్పటి నుంచి రేషన్ సరుకులు అందిస్తారన్న విషయం మాత్రం తెలియలేదు.