కేబీసీ షోలో మహిళ కాళ్లు మొక్కిన అమితాబ్‌ - MicTv.in - Telugu News
mictv telugu

కేబీసీ షోలో మహిళ కాళ్లు మొక్కిన అమితాబ్‌

August 23, 2019

#KBC2019

The first Karamveer to grace our Hotseat will be mother to 1200 children, Sindutai Sapakal. Salute this great social worker, watch her on #KBC, this Friday at 9 PM Amitabh Bachchan

Posted by Sony Entertainment Television on Tuesday, 20 August 2019

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షోలో ఆయన ఓ మహిళ కాళ్లుమొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే.. సింధూతాయ్‌ సప్కల్‌. ఆమె మహారాష్ట్రకు చెందిన ఓ సామాజికవేత్త. దాదాపు వెయ్యి మందికిపైగా అనాథలకు అన్నీ తానై చూసుకుంటోంది. కేబీసీ తాజా సీజన్‌లో ఓ ఎపిసోడ్‌లో సింధూతాయ్‌ పాల్గొన్నారు.

‘నీ కన్నీటి ద్వారా జీవితాన్ని చూడు. ఏడ్చిన తర్వాత నవ్వడం నేర్చుకో. ఎందుకంటే నేను నీకు తల్లిలాంటిదాన్ని. నీతోనే ఉంటాను బేటా’ అంటూ సింధూతాయ్‌..అమితాబ్ ముందు ఓ మరాఠీ పద్యం పాడారు. ఆ తర్వాత ఆమె గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ఆయన సీటు నుంచి లేచి ఆమె పాదాలను నమస్కరించారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్‌ను త్వరలో ప్రసారం చేయనున్నారు.