Amitabh Bachchan's ribs in 'Project K' shooting
mictv telugu

Amitabh Bachchan:’ప్రాజెక్ట్ కె’ షూటింగ్‎లో అమితాబ్ బచ్చన్‎కు గాయాలు..

March 6, 2023

 Amitabh Bachchan's ribs in 'Project K' shooting

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హైదరాబాద్‌లో తన ‘ప్రాజెక్ట్ కె’ సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. రామోజీ ఫిలీం సిటీలో జరుగుతున్న షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెముకలకు గాయాలయ్యాయి. వెంటనే హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. సీటీ స్కాన్ తీసిన వైద్యులు పక్కటెముకలకు గాయాలైనట్లు తెలిపారు. ఈ విషయాన్ని అమితాబ్ తన బ్లాగ్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆయన ముంబైలో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.