అమితాబ్ కు పిచ్చా…………అన్నారట
అమితాబ్ బచ్చన్ కు పెద్ద పులులు అంటే బాగా ఇష్టం ఉన్నట్లుంది. అందుకే ఆయన ఆ మధ్య పెద్ద పులుల సంరక్షణ గురించి జరిగిన చైతన్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీటీవిలో జరిగిన డిటేబ్ లో డే అంతా పాల్గొన్నారు. ఇంతకు పెద్ద పులి విషయం ఎందుకొచ్చిందంటే……..
అప్పట్ల బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ఓ పనికి సంబంధించిన ఫోటోను చూసిన కొందరు ఆయనకేమైన పిచ్చా అన్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో పంచుకున్నారు. 1977లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘‘ఖూన్ పసీనా’’ సిన్మాలో పెద్ద పులితో ఫైట్ సీన్ ఉంటుంది. అయితే అది గ్రాఫిక్సో లేక పోతే డూప్లీకేట్ పులో ….. డూబ్ హీరోతో చేసింది కాదట. తానే స్వయంగా పెద్ద పులితో ఈ ఫీట్ చేశారట. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఈ తరం స్టంట్ మాస్టర్లకు ఈ ఫోటో చూపించారట. దీన్ని చూసిన వారు అమితాబ్ బచ్చన్ కు ఏమైనా పిచ్చా అన్నారట.
ఈ వయస్సులో కూడా అమితాబ్ 102 నాటౌట్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రాలో నటిస్తున్నారట.