Home > Flash News > అ"మిత్" షో…యూపీ ఫార్ములా వర్కౌట్ అవుతుందా..?

అ"మిత్" షో…యూపీ ఫార్ములా వర్కౌట్ అవుతుందా..?

బీజేపీ మాస్టర్ మైండ్ , ఆ పార్టీ చీఫ్ అమిత్ షా సౌతిండియాపై నజర్ పెట్టారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లపై ఫోకస్ పై చేశారు. బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తొలుత నల్గొండలో మొదలైన టూర్ లో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే బీసీ ,దళిత వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సర్కార్ నిర్లక్ష్యం చేసిన నేతల్ని , వర్గాల్ని కలుపుకుపోతూ ముందుకు సాగుతున్నారు. యూపీ ఫార్మూలను తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసే యోచనలో ఆయన ఉన్నారు.
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కు దీటైన ప్రతిపక్షం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లో ప్రజా పోరు కన్నా వర్గ పోరే ఎక్కువ. ప్రెస్ మీట్లు తప్ప ప్రత్యక్ష పోరాటలూ తక్కువే.టీడీపీలో ఒంటరిపోరే. రేవంత్ రెడ్డి మినహా గట్టిగా మాట్లాడే మాస్ ఫాలోయింగ్ లీడర్ ఎవరు లేరు. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటోంది బీజేపీ. టీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ అసలు సిసలైన ప్రతిపక్షంగా మారాలని ఆ పార్టీ చీఫ్ అమిత్ షా భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ టూర్ మొదలెట్టేశారు.
నల్గొండలో మూడురోజుల పర్యటనలో పల్లెల్ని చుట్టేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాల్ని వివరించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బూత్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు. పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యల్ని వివరించారు. మూడు ప్రత్యేక గ్రామాల్లో అమిత్ షా పర్యటించేలా బీజేపీ ప్లాన్ చేసింది. దేవులపల్లి, తేరట్ పల్లి, గుండ్రాంపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాల అమలుతీరుపై ఆరాతీశారు. తేరట్ పల్లిలోని 16 కుటుంబాలను ఆయన పరామర్శించారు. వ్యవసాయానికి సంబంధించిన సాధక బాధకాలను ఆయన తెలుసుకొన్నారు. దళితవాడలో అమిత్ షా సహపంక్తి భోజనం చేశారు. బుధవారం ఆయన చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో పర్యటించారు. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన…త్యాగాలకు మారుపేరు గుండ్రాంపల్లి అన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన గుండ్రాంపల్లి పోరాటం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అలాగే గుండ్రాపల్లి పోరాటాన్ని చరిత్రలో లిఖిస్తామన్నారు.
ఇలా మూడురోజుల పాటు పర్యటించిన అమిత్ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ కేంద్ర పథకాలను వివరిస్తూ ప్రధానంగా సాగింది. సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్న వర్గాల్ని , నేతల్ని కలుపుకుపోయే చేశారు. బీసీ మంత్రను జపిస్తూ యూపీ ఫార్ములా అమలు చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ నేతలతో మాట్లాడుతున్నారు. ఇతర వర్గాల నేతలతోనే టచ్ లో ఉన్నారు. పార్టీలో చేరడానికి నల్లగొండ, హైదరాబాద్, ఢిల్లీలో మా నేతలను ఇతర పార్టీల వారు సంప్రదిస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.రాబోయే రోజుల్లో ఊహించని స్థాయిలో పార్టీలో చేరికలుంటాయన్నారు.
అటు ఏపీపై అమిత్ షా దృష్టి పెట్టారు.బాబు సర్కార్ పై రగిలిపోతోన్న కాపు నేతల్ని కలుపుకుపోయేందుకు వ్యూహం రచిస్తున్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మొత్తానికి 2019 ఎన్నికల లక్ష్యంగానే దక్షిణాదిలో అమిత్ షా పర్యటన సాగుతుంది. దీనికి తెలంగాణను వేదికగా చేసుకుంది. గ్రామీణ ప్రాంతంలో బీజేపీ బలపడటమే అమిత్ షా టూర్ టార్గెట్. సో తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి.
.

Updated : 24 May 2017 8:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top