అమ్మా భయపడొద్దు.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు: విశ్వక్‌సేన్ - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మా భయపడొద్దు.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు: విశ్వక్‌సేన్

May 4, 2022

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్‌‌ తాజాగా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. విశ్వక్‌సేన్ కథనాయకుడిగా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా ప్రీరిలీజ్ వేడుక మంగళవారం ఖమ్మం జిల్లా లేక్‌వ్యూ క్లబ్‌లో జరిగింది.

ఈ వేడుకలో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. ‘ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చాను. అలాంటి నాపై కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. నా జీవితంలో నేను సమాధానం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆమె మా అమ్మ. అమ్మా.. నీ కొడుకుకు ఏమీ కాదు. నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు. నువ్వు ధైర్యంగా ఉండు” అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.

సినిమా ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌లో ఇటీవలే ఓ రహదారిపై విశ్వక్‌సేన్ ప్రాంక్ వీడియో చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో వైరల్‌ అవ్వడంతో.. హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రమోషన్ పేరిట న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిబెట్‌లో విశ్వక్ పాల్గొని, అసభ్య పదజాలం ఉపయోగించడంతో పలువురు తీవ్రంగా విమర్శించారు. దాంతో విశ్వక్‌సేన్ క్షమాపణలు చెప్పారు.