అమ్మరాజ్యంలో కడప బిడ్డలకు స్వేచ్ఛ.. సెన్సార్ బోర్డ్ ఓకే - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మరాజ్యంలో కడప బిడ్డలకు స్వేచ్ఛ.. సెన్సార్ బోర్డ్ ఓకే

December 11, 2019

Amma rajyamlo kadapa biddalu

సినిమాలో ఏముందోగాని, విడుదలకు ముందే కలకలం రేపుతున్న ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డల’ లొల్లి ముగిసింది. ఈ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు ఎట్టకేలకు అంగీకరిస్తూ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ రోజు కూడా వివాదంపై  తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. రివ్యూ కమిటీ సూచలను దృష్టిలో ఉంచుకుని సెన్సార్ బోర్డు నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆదేశించింది. దీంతో సెన్సార్ బోర్డు.. రివ్యూ కమిటీ నిర్ణయాన్ని పున:పరిశీలించి సినిమాకు `యు/ఎ` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో చిత్రాన్ని అనుకున్న ప్రకారం రేపు (ఈ నెల 121)న విడుదల చేయనున్నారు. 

సెన్సార్ సర్టిఫికెట్‌ను చిత్ర నిర్మాత రాంగోపాల్ వర్మ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘మా సినిమాను అడ్డుకోబోయిన వారికి చేదువార్త. భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చింది. సినిమా డిసెంబ‌ర్ 12న విడుద‌ల‌వుతుంది. ఇది రెండు కులాల మ‌ధ్య గొడ‌వ పెట్టే సినిమా కాదు.. ఇది ఒక ఎంట‌ర్‌టైన్మెంట్ సినిమా అని అనుకోకుండా త‌ప్ప‌క చూడండి` అని ఆయన ట్వట్ చేశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు, కుల రాజకీయాలను ఈ చిత్రంలో చూపడంతో రచ్చ మొదలైంది.