భారత్ నుంచి హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఔట్.. ఖాతాలు సీజ్ చేశారని..  - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ నుంచి హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఔట్.. ఖాతాలు సీజ్ చేశారని.. 

September 29, 2020

vhmhbmg

ప్రముఖ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత్ నుంచి వెళ్లిపోయింది. మోదీ ప్రభుత్వం తమ ఖాతాలను సీజ్ చేసి, వేధిస్తోందంటూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో నిధులు సేకరిస్తున్నాయంటూ ప్రభుత్వం పలు ఎన్జీవోలపై మనీలాండరింగ్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటుండడం తెలిసిందే. 

తమ బ్యాంకు ఖాతాలను ఈ నెల 10 నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అప్రజాస్వామికంగా స్తంభింపజేశారని, ఇక భారత్‌లో కార్యకలాపాలను నిర్వహించడం సాధ్యం కాని అమ్నెస్టీ ఇండియా పేర్కొంది. అయితే ఈ సమస్యపై చట్టబద్ధంగా పోరాడతామని కూడా పేర్కొంది. దేశంలో హక్కుల ఉల్లంఘన జరుగుతోందని తాము నివేదికలు ఇచ్చినందుకు తమపై దాడులు జరుగుతున్నాయని, ఆమ్నెస్టీ ఇండియా ప్రతినిధి రజత్ ఖోస్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ అల్లర్లు, జమ్ముకశ్మీర్ అంశాలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదని చెప్పారు. ప్రస్తుతం ఆమ్నెస్టీ 70కిపైగా దేశాల్లో పనిచేస్తోందని, నాలుగేళ్ల కిందట రష్యా నుంచి మాత్రమే తాము తప్పుకున్నామని తెలిపారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కిందంటూ ఆమ్నెస్టీ ఇండియాపై గత ఏడాది నవంబర్‌లో సీబీఐ  ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, ఈడీ దాని బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది.