అంఫాన్ బీభత్సం షురూ.. ఉత్తరాంధ్రలో ఉప్పొంగుతున్న కడలి - MicTv.in - Telugu News
mictv telugu

అంఫాన్ బీభత్సం షురూ.. ఉత్తరాంధ్రలో ఉప్పొంగుతున్న కడలి

May 19, 2020

Amphan cyclone deepened alert in Andhra Pradesh 

అంఫాన్ తుపాను ఉత్తరాంధ్రను వణికిస్తోంది. భీకర పెనుగాలులు వీస్తున్నాయి. సముద్రం హోరున గర్జిస్తోంది. తూర్పుగోదాదరి ఉప్పాడ తీరంలో 20 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. పలు రోడ్లు ధ్వంసమయ్యాయి. తీరప్రాంతంలోని గుడిసెల్లోకి నీరు చేరుకుంటోంది. కేంద్రం ముందు జాగ్రత్త చర్యంగా ఒడిశా, ఏపీ, పశ్చిమ బెంగాల్‌లలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దించింది. కృష్ణపట్నం ఓడరేవులో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 

లోతట్టు ప్రాంతాల ప్రజలు జవాన్లు ఖాళీ చేయిస్తున్నారు. తుపాను రేపు(బుధవారం) తీరం దాటే అవకాశముంది. గంటలకు 160 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉత్తరాంధ్రతోపాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ రోజు, రేపు భారీ నుంచి తేలికపాటి వానలు కురిస్తాయంటోంది. ప్రభుత్వ హెచ్చరికతో జాలర్లు పడవలను, వలను ఎత్తయిన ప్రాంతాలకు తరలిస్తున్నారు.