తీరం దాటిన అంఫాన్.. ప్రజలకు హైఅలర్ట్ - Telugu News - Mic tv
mictv telugu

తీరం దాటిన అంఫాన్.. ప్రజలకు హైఅలర్ట్

May 20, 2020

Amphan

భీకర తుపాను అంపాన్ తీరం దాటింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పశ్చిమ బెంగాల్లో తీరాన్ని చేరిందని, సాయంత్రం ఏడు, ఎనిమిది గంటలకల్లా దాటివేత కొసాగుతుందని భారత వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ప్రభావం కారణంగా పలు ప్రాంతాలు పెనుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాని హెచ్చరించారు. అంఫాన్ బెంగాల్‌లోని దిఘా పట్టణానికి ఆగ్నేయ దిశలో 65 కి.మీ.ల దూరంలో తీరాన్ని తాకింది. 

అంఫాన్ కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే కొన్నిచోట్ల వర్షాలు మొదలయ్యాయి. భారీ సంఖ్యలో చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. ఒడిశాలోని బాలసార్ జిల్లాలో వానలు ముంచెత్తుతున్నాయి.జాతీయ విపత్తు సహాయక బృందాలు(ఎన్డీఆర్‌ఎఫ్‌) ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. బెంగాల్లో 6 లక్షల మందిని, ఒడిశాలో రెండు లక్షల ఎగువ ప్రాంతాలకు తరలించారు.