ఈ సూపర్ ఆఫీసర్..... మన వైజాగ్ అమ్మాయే... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ సూపర్ ఆఫీసర్….. మన వైజాగ్ అమ్మాయే…

June 30, 2017

తెలంగాణల ఎవరి తెల్సిన తెల్సినా తెల్వకున్నా ఆమె పేరు చెప్పంగనే ఓ ఫలనా అంటరు. అంతటి పేరు తెచ్చుకున్న వరంగల్ అర్బన్ యంగ్ కలెక్టర్ అమ్రపాలి. ఆమె ఏ పనిచేసినా ఏదో సంచలనమే  ఉంటది. మాట మాట్లాడినా కూడా బోల్డ్. అయితే ఈమె  మోడ్రన్ గా ఉండగలదు… కాస్మోపాలిటన్ కల్చర్ తో కళ్లు చెదరగొట్టే లా తయారు కాలగదు. ఎప్పుడు చూసినా  ఫుల్ ఎనర్జీ తో కన్పించే ఈ మేడమ్ గారు. తన ఫిట్ నెస్ రహస్యం చెప్పారు…. అంటే దినాం జ్యూసులు…  డ్రైఫ్రూట్ తింటుందని అనుకునేరు.

వెరీ సింపుల్ పొద్దున్నే రెండంటే రెండే ఇడ్లీలు తింటారు. పగటిల రెండు చపాతీలు ఇంత కూర, మాపటిలి కూడా రెండు రొట్టెలు ఇంత కూర బస్. అయితే పొద్దున్నే యోగా మాత్రం డెయిలీ చేస్తారట. అమ్రపాలి పేరు చూసి ఏదో ఉత్తరాది అనుకుంటు పొరపాటే. ఆమె మన తెలుగు  అమ్మాయే. వీళ్లది విశాఖపట్నం అట. వీళ్ల నాయన  అక్కడ ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్  కొల్వు చేస్తున్నడట.

ఆమె జనాలకు సంబంధించిన పనలు చేయడంలో కూడా చాలా క్రియేట్ గా ఉంటారు. మున్సిపల్ కార్మికులకు బహుబలి సిన్మా చూపిస్తానని టికెట్లు కొన్నారు. అప్పట్ల ఇదో హాట్ న్యూస్ అయింది. కానీ ఇందులో  ఆమె తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. తనకో… తన పరివారానికో అడగ లేదు. కార్మికుల కోసం. వాళ్ల సమస్యల పరిష్కారం విషయంలో  కూడా బోల్డ్ గా ఉంటారట.మన  తెలుగు అమ్మాయి… మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నది.