ఏపీలో రాజధాని పేరిట భూములిచ్చిన రైతులు ప్రభుత్వం తమకు కౌలు డబ్బులు ఇవ్వలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం నాడు విచారణకు రానుండగా, వెంటనే స్పందించిన ప్రభుత్వం సోమవారమే రైతుల అకౌంట్లలో కౌలు డబ్బులను జమ చేసింది. గతంలోనూ ఇలాగే జరిగింది. నాడు కూడా రైతులు పిటిషన్ వేయగా, వెంటనే కౌలు డబ్బులను చెల్లించాలని సీఆర్డీఏను కోర్టు ఆదేశించింది. దాంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి ముందు జాగ్రత్త చర్యగా కౌలు డబ్బులను సీఆర్డీఏ జమ చేసింది.