అమరావతి ఇంటర్ సిటీలో బాంబు కలకలం - MicTv.in - Telugu News
mictv telugu

అమరావతి ఇంటర్ సిటీలో బాంబు కలకలం

February 6, 2020

jsvgh

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉన్న రైలులో బాంబు ఉందంటూ వచ్చిన వార్తతో అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. అమరావతి ఇంటర్ సిటీ రైలులో బాంబు అమర్చినట్టు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. రైలు అంతా తనిఖీలు చేసి ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చింది. ఆ తర్వాత రైలు ప్లాట్ ఫాం నుంచి కదిలింది. బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

సికింద్రాబాద్ నుంచి అమరావతి వెళ్లాల్సిలన ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు 5.50 గంటలకు వెళ్లాల్సి ఉంది. అంత కంటే కొంచెం ముందు బాంబు ఉన్నట్టు ఫోన్ వచ్చింది. వెంటనే రైలును స్టేషన్‌లోనే నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. బాంబులేదని నిర్థారించుకొని రైలు ప్రయాణం ప్రారంభించింది.ఈ వార్తతో స్టేషన్‌లో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆకతాయిల పనిగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్‌కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకునే పనిలో పడ్డారు.