అసెంబ్లీ ఆకాశంలోకి దూసుకుపోవాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

అసెంబ్లీ ఆకాశంలోకి దూసుకుపోవాల్సిందే..

December 16, 2017

1350 ఎకరాల్లో నిర్మించనున్న ఆంధ్ర ప్రదేశ్ కలల రాజధాని అమరావతిలో ప్రభుత్వ సముదాయ నిర్మాణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారందరూ. ఆ ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఏపీ ప్రభుత్వం శాసనసభ భవనానికి సంబంధించిన టవర్ ఆకృతిని దాదాపుగా ఖరారు చేసింది.  మంత్రి వర్గంలో చర్చించిన అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన చాలా డిజైన్లను పరిశీలించారు. ఈ భవనం ఆకృతిపై సామాజిక మాధ్యమాల్లో ప్రజాభిప్రాయం కోరగా 17,088 మంది టవర్ ఆకృతికే ఓటేశారు. 7,817 మంది మాత్రం చతురస్రాకారపు ఆకృతికి ఓటేసినట్టు మంత్రి నారాయణ తెలిపారు.


విజయవాడలోని ఓ హోటల్‌లో హైకోర్ట్, శాసనసభ, నగర బృహత్ ప్రణాళికను పరిశీలించారు. ఆ ప్రణాళికలో భాగంగా రహదారులు, పార్కుల విషయంలో స్వల్ప మార్పులు చేశారు. గతంలో శాసనసభ భవనాన్ని ప్రత్యేకంగా నిర్మించాలనుకున్నారు. ఇప్పుడు శాసనసభతో పాటు, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే బ్లాకులోకి వచ్చేలా మార్పులు చేశారు.

ఈ బ్లాక్ మొత్తం 250 ఎకరాలు కాగా దాని మధ్యలో శాసనసభ భవనాన్ని టవర్ ఆకృతిలో నిర్మించనున్నారు. అందులో 120 ఎకరాల్లో ఓ తటాకంలా ఏర్పాటు చేసి, తటాకంలో భవనం ప్రతిబింబం కనిపించేలా నిర్మాణం జరుపుతారు. ఈ భవనం ఎత్తు 250 మీటర్లు కాగా, 40 మీటర్ల వరకు పైకి వెళ్లి నగరాన్ని వీక్షించేలా వుంటుంది. శాసనసభ, సెంట్రల్ హాల్, పరిపాలనా విభాగం, శాసనమండలి సమావేశ మందిరాలు ఇలా నాలుగు విభాగాల మధ్య మ్యూజియం వుండేలా ఈ ఆకృతి వుంటుంది.

telugu news, The vast majority of the tower format is the design of the legislative building that will be built in Amravati!