అమరావతికి రైల్వేలైన్… రూ.883 కోట్లతో - MicTv.in - Telugu News
mictv telugu

అమరావతికి రైల్వేలైన్… రూ.883 కోట్లతో

September 26, 2018

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలుమార్గం దారులు సుగమం అవుతున్నట్టుగానే వున్నాయి. రూ.883 కోట్లతో రైలు మార్గం నిర్మాణానికి సవివరమైన నివేదికలను రైల్వే బోర్డుకు పంపామని, త్వరలోనే అనుమతులు వస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌  మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ముందు సింగల్‌ లైన్‌ నిర్మిస్తామని, డిమాండ్‌ను బట్టి రెండో లైను ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. రెండు లైన్లకు సరిపడా మార్గానికి భూసేకరణ జరుగుతోందని వివరించారు.Amravati Railway line ... Rs 883 croresఅలాగే రానున్న రెండేళ్లలో దక్షిణ మధ్య రైల్వే జోనంతా విద్యుదీకరణ పనులు పూర్తవుతాయని వివరించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను రూ.400 కోట్లతో పీపీపీ పద్ధతిలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు టెండర్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. గుంటూరు, విజయవాడ, గుంతకల్, కర్నూల్‌ రైల్వేస్టేషన్లను కూడా 2019 మార్చి నాటికి పూర్తిగా ఆధునీకరిస్తామని జీఎం వివరించారు. గుంటూరు–గుంతకల్‌ సెక్షన్‌ విద్యుదీకరణ పూర్తయి, డబ్లింగ్‌ పనులు జరుగుతున్నాయని వివరించారు.