అమృతకు హత్యా బెదిరింపులు.. - MicTv.in - Telugu News
mictv telugu

అమృతకు హత్యా బెదిరింపులు..

December 5, 2017

తమిళనాడు దివంగత సీఎం జయలలిత, నటుడు శోభన్ బాబుల కూతురినంటూ సుప్రీం కోర్టు గడప తొక్కిన బెంగళూరు యువతి అమృతను రాజకీయ నేతలు, జయ నెచ్చెలి శశికళ బంధువులు టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

తనను చంపేస్తామంటూ గుర్తతెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆమె చెప్పింది. ముఖ్యంగా తమిళనాడు నుంచి ఈ ఫోన్లు వస్తున్నాయని  పేర్కొంది. జయ కూతురినని ఇదివరకు ప్రకటించుకున్నప్పుడు బెదిరింపులు రాలేదని, సుప్రీం కోర్టుకు వెళ్లినప్పటి నుంచి వస్తున్నాయని ఆమె తెలిపింది. ఆ తర్వాత అమృత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీనిపై బెంగళూరులో కలకలం రేగింది.

జయలలిత వదిలేసి పోయిన వేల కోట్ల ఆస్తుల కోసం పావులు కదుపుతున్న శశికళ ముఠానే అమృతకు ఫోన్లు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోపక్క.. అమృత జయలలిత పరువు మంటగలిపిందని అన్నాడీఎంకే భగ్గుమంటోంది. పురుచ్చితలైవి గంగానది అంత పవిత్రమైందని, ఆమె శోభన్ బాబుతో బిడ్డను కనడం అబద్ధమని పార్టీ నేత తంగవేలు మాణిక్యన్ వ్యాఖ్యానించాడు. అమృతపై పరువు నష్టం దావా వేసేందుకు సీఎం పళనిస్వామి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.