Amrita selling coffees made with bhang in pune
mictv telugu

గంజాయితో కాఫీ, శాండ్‌విచ్‌లు.. ఈ హోటల్ ఎక్కడుందంటే

June 7, 2022

Amrita selling coffees made with bhang in pune

ఈ మధ్య తెలుగు రాష్ట్రాలలో గంజాయి వినియోగం, రవాణా, సరఫరా వంటివి బాగా పెరిగిపోయాయి. నిత్యం వాటికి సంబంధించిన వార్తలు, కేసుల వివరాలు వింటూనే ఉన్నాం. ఎందుకంటే గంజాయి పండించినా, తరలించినా, సేవించినా మన చట్టాలకు విరుద్ధం కాబట్టి. కానీ, పుణెలో గంజాయితో నడిచే ఓ కాఫీ షాపుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మహిళ ఆధ్వర్యంలో నడిచే ఈ కాఫీ షాపులో గంజాయితో చేసిన కాఫీ, శాండ్‌విచ్‌లు అమ్ముతున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. గంజాయి సాగు చేయడం మన వద్ద చట్ట విరుద్ధం కానీ, ఉత్తరాఖండ్‌లో చట్టసమ్మతమే. అయితే అక్కడ గంజాయిని నేరుగా వినియోగించడం చాలా తక్కువ. భాంగా అనే పానీయాన్ని అక్కడి ప్రజలు కేవలం హోళీ రోజున తాగడానికి ప్రభుత్వ అనుమతి ఉంది. భాంగాను పండుగ రోజున సేవించడం ఆచారం కాబట్టి ప్రభుత్వం ఆ మేరకు పర్మిషన్ ఇచ్చింది.

ఆ రోజు కొంత మంది భాంగాను వ్యక్తిగతంగా తయారు చేసుకొని కూడా సేవిస్తారు. భాంగాను గంజాయి మొగ్గ లేదా ఆకుతో ప్రత్యేకంగా తినదగ్గ ఔషధంలా తయారు చేస్తారు. కేవలం ఉత్తరాదిలోనే ఈ పానీయాన్ని సేవిస్తారు. అదీ ఒక్కరోజే. ఆ తర్వాత దానిని ఎవరూ తయారు చేయరు, విక్రయించరు. ఈ నేపథ్యంలో భాంగాను తయారు చేసే ఫార్ములాను కనుక్కొని ‘ద హెంప్ కేఫ్‌టేరియా’ పేరుతో అమృత అనే 30 ఏళ్ల మహిళ దుకాణం పెట్టుకుంది. ఈ దుకాణం గత నాలుగేళ్లుగా రన్నింగులో ఉంది. ఇక్కడ అమ్మే భాంగాను కలిపిన కాఫీ, శాండ్‌విచ్‌లకు మంచి గిరాకీ ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఉన్న గంజాయిపై నిషేధ చట్టాన్ని కోర్టులో సవాలు చేయడానికి రెడీ అవుతోంది అమృత. ఎందుకంటే గతంలో ఆమె డిప్రెషన్‌తో బాధపడుతుండగా, ఔషధం లాంటి భాంగాను సేవించి కోలుకున్నదంట. అంతేకాక, గంజాయి సాగుకు చాలా తక్కువ నీరు అవసరమవుతుందని ఆమె అభిప్రాయం. చూద్దాం ఆమె కోరిక నెరవేరుతుందో లేదో.

https://www.instagram.com/the_hemp_cafeteria/?utm_source=ig_embed&ig_rid=9e8f23ad-d33b-4216-8b76-42371ca6015c