అమృత్ సర్ సిటీ రణరంగంగా మారింది. వందలాది మంది నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఓ సిక్కు గురువు అనుచరుడిని అరెస్ట్ చేశారన్న కారణంగా పోలీస్ స్టేషన్ ముందు గొడవకు దిగారు. బారికేడ్లను తొలగించి మరీ రచ్చరచ్చ చేశారు.
వారిస్ పంజాబ్ దే గ్రూప్ ఛీఫ్ అమృత్ పాల్ సింగ్ అనుచరుడు లవ్ ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్‌ను నిరసిస్తూ వందలాది మంది మద్దతుదారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అజ్ నాలా పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఫెన్సింగ్ దాటి వెళ్ళారు. అడ్డుగా పెట్టిన బారికేడ్లను తొలగించారు. రాజకీయ దురుద్దేశంతోనే తన అనుచరుడు లవ్ ప్రీత్ సింగ్ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వారిస్ పంజాబ్ దే గ్రూప్ ఛీఫ్ అమృత్ పాల్ సింగ్ ఆరోపించారు. కేసు వెనక్కి తీసుకోకపోతే జరిగే పరిణామాలకు అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. తమ శక్తి ఏంటో తెలిపేందుకే ఈ బలప్రదర్శన చేపట్టామని చెప్పారు. మద్దతుదారులను అజ్ నాలి పోలీస్ స్టేషన్ దగ్గర బారీగా పోలీస్ బలగాలను మోహరించారు. వారిస్ పంజాబ్ దే గ్రూప్‌ను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.