mictv telugu

నాకే పాపం తెలీదు.. గ్రీన్ సిగ్నల్ పడింది, వెళ్లిపోయా.. డ్రైవర్

October 20, 2018

అమృత్‌సర్‌లో నిన్న రాత్రి రావణదహనం సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదానికి రైల్వే నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ట్రాక్ తనిఖీ చేసి సమాచారం అందించాల్సిన లైన్‌మెన్ తప్పిదంతోనే 59మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన రైలు డ్రైవర్.. పంజాబ్ పోలీసులకు తెలిపిన వివరాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. ‘రైలు ముందుకు వెళ్లేందుకు నాకు గ్రీన్ సిగ్నల్ కనిపించింది. ఆ సమయంలో రైలు పట్టాలపై అంతమంది ఉన్నారని నాకు తెలీదు. గతంలో జనం ఉన్న దాఖలాలు లేవు. పైగా రాత్రి సమయం. అది రెగ్యులర్‌గా రైలు వెళ్లే సమయంం  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా అని ఎప్పటిలాగే రైలు ముందుకు పోనిచ్చాను. పట్టాలపై జనం నిలబడి ఉంటారని అసలు ఊహించలేదుటపాసులు కాల్చడంతో భారీగా పొగ అలుముకోవడం, ట్రాక్ లో మలుపు ఉండడంతో నాకు జనం కనిపించలేదు’ అని రైలు డ్రైవర్ చెప్పాడు.

ttt

ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న లైన్‌మెన్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. ట్రాక్ మీద జనాలు ఉన్నట్లు డ్రైవర్‌కు తాను సమాచారం ఇవ్వకుండానే  గ్రిన్ సిగ్నల్ ఇచ్చానని వెల్లడించాడు. రావణ దహన వేడుకలకు భద్రత కావాలని పోలీసులను కోరామని, అయితే వారు పట్టించుకోలేదని నిర్వాహకులు ఆరోపించారు. కాగా ప్రమాద సమయంలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ విదేశీ పర్యటనలో ఉన్నారు. సమాచారం తెలియగానే ఆయన ఢిల్లీ బయలుదేరారు. రైల్వే సహాయ మంత్రి మనోజన్ సిన్హా శుక్రవారం రాత్రే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం కారణంగా 17 రైళ్లను రద్దు చేసి, పలు రైళ్లను దారి మళ్లించారు.