మా జీవితాలతో చెలగాటమా? వర్మపై అమృత ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

మా జీవితాలతో చెలగాటమా? వర్మపై అమృత ఫైర్

August 4, 2020

Amrutha fires on director ram gopal varma.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమృత ప్రణయ్ నిజ జీవిత సంఘటన ఆధారంగా ‘మర్డర్‌’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా వర్మ ఈ సినిమాకు సంబంధించిన ‘పిల్లల్ని ప్రేమించడం తప్పా’ అనే పాటను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అమృత ఈ సినిమాపై ఘాటుగా స్పందిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. దర్శకనిర్మాతలు మా జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఆ ప్రకటనలో తెలిపింది. ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది. తమ అనుమతి లేకుండా తమ పేర్లు, నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తీసి తమ జీవితాలపై ప్రభావం చూపుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది.

‘మర్డర్’ కథలో తమ పేర్లను, ఫోటోలను వాడుకున్నారని ఈ సినిమాను నిలిపి వేయాలని గత నెల 29న నల్గొండ జిల్లా కోర్టులో అమృత పిటిషన్ దాఖలు చేసింది. దీంతో వాట్సప్, మెయిల్ ద్వారా దర్శకుడు, నిర్మాతకు నోటీసుల వెళ్లాయి. ఈ కేసులో ఆగస్టు 6న మొదటి హియరింగ్ జరుగనుంది. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నేరుగా థియేటర్లలో విడుదల చేయాడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.