తెలంగాణలో ఎంసెట్ తేదీలు ఖరారు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో ఎంసెట్ తేదీలు ఖరారు

March 22, 2022

ap

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షల తేదీలను మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ పరీక్షలు జులై 14, 15, 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జులై 18న ఈసెట్ జరగనుందని, జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ నిర్వహిస్తామని అన్నారు. జులై 18, 19, 20వ తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పరీక్షలను 28 రీజనల్ సెంటర్స్ పరిధిలోని 105 పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో నిర్వహిస్తామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

మరోపక్క తెలంగాణలో ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పరీక్షలను నిర్వహించే దిశగా నిర్ణయాలు తీసుకొని, పరీక్ష తేదీలను ప్రకటించింది.