ఏపీలో ఎంసెట్ తేదీలు ఖారారు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఎంసెట్ తేదీలు ఖారారు

March 23, 2022

12

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్‌ షెడ్యూల్‌‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎంసెట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ”ఎంసెట్ షెడ్యూల్‌ను విడుదల చేస్తున్నాం. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షల తేదీలను ఖారారు చేశాం. జులై 4 నుంచి 8వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌, జూలై 11,12 తేదీల్లో అగ్రికల్చర్‌ పరీక్ష నిర్వహిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 134 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నాం. ఇక, ఈ పరీక్షల కోసం తెలంగాణలోనూ 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్‌ 11వ తేదీన పూర్తి వివరాలతో ఈఎపీసెట్ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించారు.

మరోపక్క తెలంగాణలో సైతం ఎంసెట్ తేదీలను విద్యాశాఖ మంత్రి సబిదా ఇంద్రరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీలోను ఈ పరీక్షలకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. దీంతో ఎంసెట్ నోటీఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అలర్ట్ అయ్యారు.