తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది RRR.ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ప్రతిఒక్కరూ ఆర్ఆర్ఆర్ టీంకు స్పెషల్ గా విష్సేస్ చెబుతున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు అవార్డు దక్కిన సంగతి తెలిసింేద. అవార్డు గోస్ టూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు అనగానే తెలుగు ప్రజల్లో పట్టరాని ఆనందం నెలకొంది. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో సినీ అభిమానులతో ప్రతిఒక్కరూ సంతోషించారు.
డైరీ బ్రాండ్ అమూల్ డూడుల్స్ కు పాల ప్రొడక్టులతోపాటు డూడుల్స్ రూపొందించడంలోనూ మంచి పేరుంది. దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలకు సంబంధించి అమూల్ తయారు చేసే డూడుల్స్ ప్రతిఒక్కర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా తమదైన రీతిలో సెలబ్రేషన్ పార్టీలో చేరింది అమూల్. ప్రధాన నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి ఫొటోలతో ఒక స్వీట్ డూడుల్ ను షేర్ చేసింది. డూడుల్ లో అమూల్ టీంకు RRR రియల్లీ రిమార్కబుల్ రివార్డును ప్రదానం చేసింది.
కాగా ఈ డూడుల్‌లో ఎన్టీఆర్, రాంచరణ్ నాటు నాటు డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. కీరవాణి అవార్డు అందుకుంటూ వారి మధ్యలో నిలుచున్నట్లు ఉంది. ఈ డూడుల్ అభిమానులను ఫిదా చేస్తోంది.