ఈ విషయం మనకు ఎబ్బెట్టుగా అనిపించినా పాశ్చాత్య దేశాల్లో కామన్‌గా జరుగుతుంటుంది. కాకపోతే సదరు హీరోయిన్ టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల ద్వారా మన ప్రేక్షకులను అలరించింది కాబట్టి ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొంత ఆసక్తి నెలకొంటుంది. ఎవడు, ఐ, రోబో 2 సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న బ్రిటీష్ సుందరి అమీ జాక్సన్ వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రియుడిని పరిచయం చేసింది. బ్రిటిష్ నటుడు ఎడ్‌వెస్ట్విక్‌తో ప్రేమలో ఉన్నట్టు అధికారికంగా వెల్లడించింది. ప్రేమికుల రోజు విషెష్ చెప్తూ మరీ ఘోరంగా రొమాన్స్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా వీరి డేటింగ్‌పై వస్తున్న రూమర్లు నిజమైనట్టు తేలింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అమీ గతంలో నటిగా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు బిజినెస్ మ్యాన్ జార్జ్ పనియోటౌతో ప్రేమ వ్యవహారం నడిపింది. అంతేకాక అతనితో పెళ్లి కాకుండానే గర్భం దాల్చి ఆండ్రూ అనే కుమారుడికి సాధారణ పద్ధతిలో జన్మనిచ్చింది. గర్భంతో ఉన్నప్పుడే బాబు పుట్టిన తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుంటామని ప్రకటించినా తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. తాజాగా మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె అభిమానులు షాకవుతున్నారు. అంటే పెళ్లి కాకుండానే ప్రియుడితో కుమారుడని కని అతడిని పెళ్లి చేసుకోకుండానే మరొకరితో సహజీవనం చేస్తుందన్న నిజాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మెజారిటీ అభిమానులు ఆమె వ్యవహారాన్ని తప్పుపడుతూ కామెంట్లు పెడుతున్నారు.