రోడ్ల మరమ్మత్తులను పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులపై పదకొండేళ్ల బాలిక మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. గతేడాది డిసెంబర్ 30వ తేదీన రోడ్డు ప్రమాదాల నివారణ కోసం శేరిలింగంపల్లిలో ఓ సమావేశం జరిగింది. ఇందులో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ, స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. వాహనాల వేగం తగ్గించడంతో పాటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని, దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయని శాహెర్కౌర్ అనే బాలిక మాదాపూర్ డీసీపీ శిల్పవల్లికి ఫిర్యాదు చేసింది.