ఆ కుక్కపిల్ల 18 వేల ఏళ్లుగా.. అలాగే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆ కుక్కపిల్ల 18 వేల ఏళ్లుగా.. అలాగే..

November 30, 2019

18 వేల ఏళ్ల క్రితం చనిపోయిన ఒక కుక్కపిల్ల మృతదేహాన్ని పరిశోధకులు కనుగొన్నారు. సైబీరియాలో ఇటీవలే ఈ కుక్కపిల్లను కనుగొన్నారు. అయితే ఇది కుక్కపిల్లా లేకపోతే తోడేలు పిల్లా అనేది ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ జీవి చనిపోయినప్పుడు రెండు నెలల కన్నా తక్కువ వయస్సు కలిగి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ కుక్కపిల్ల ఏ విధంగా చనిపోయిందో దానికి సంబంధించిన కారణాలు ఇంకా శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. 

Puppy.

మందపాటి జుట్టు, మూతి, మీసాల వెంట్రుకలతో కుక్కపిల్ల శరీరం మంచుతో కప్పబడి ఉన్నందున అవన్నీ సజీవంగా ఉన్నప్పటిలాగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ జంతువు వయస్సు 18,000 సంవత్సరాలు ఉన్నట్లు స్వీడన్ శాస్త్రవేత్తలు  ధృవీకరించారని ఓ నివేదిక చెబుతోంది. దాని జన్యువును 2X కవరేజీకి క్రమం చేశారని తెలిపింది. ఆ కుక్కపిల్లకి డోగోర్ అని పేరు పెట్టారు, స్థానిక యాకుట్ మాండలికంలో స్నేహితుడు అని అర్థం వస్తుంది. 

tt