వంతెన కింద ఇరుక్కున్న విమానం..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

వంతెన కింద ఇరుక్కున్న విమానం..వీడియో

October 22, 2019

రన్ వే పై దూసుకుపోయే విమానం వంతెన కింద ఇరుక్కోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? చైనాలోని హర్బిన్‌లో ఓ విమానాన్ని విడి విడి భాగాలుగా చేసి భారీ ట్రక్‌లో రోడ్డు మార్గం మీదుగా విమానాశ్రయానికి తరలించారు. మార్గ మధ్యలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి వచ్చింది. డ్రైవర్ ఎత్తుని సరిగ్గా అంచనా వేసుకోకుండా ట్రక్‌ను ముందుకు పోనిచ్చాడు. 

దీంతో ఆ విమానం వంతెన కింద ఇరుక్కుంది. ఇప్పుడు దీన్ని ఎలా బయటకు తీయాలా అని విమానాయన సంస్థ అధికారులు పరేషాన్ అవుతున్నారు. వంతెన తొలగించి దాన్ని బయటకు తీయడం అసాధ్యమని కొందరు సలహా ఇచ్చారు. ట్రక్కు టైర్లలో గాలి తీసి తద్వారా విమానాన్ని బయటకు తీయొచ్చని కొందరు సలహా ఇచ్చారు. టైర్లలో గాలి తగ్గగానే విమానానికి, వంతెనకు మధ్య ఖాళీ ఏర్పడుతుందని  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.