కాన్పూర్ ఐఐటీకి వంద కోట్ల విరాళం ఇచ్చిన పూర్వ విద్యార్ధి - MicTv.in - Telugu News
mictv telugu

కాన్పూర్ ఐఐటీకి వంద కోట్ల విరాళం ఇచ్చిన పూర్వ విద్యార్ధి

April 5, 2022

hbn

కాన్పూర్ ఐఐటీకి ఇండిగో సహ వ్యవస్థాపకులు రాకేశ్ గంగ్వాల్ రూ. వంద కోట్లను బహుమతిగా ఇచ్చారు. ఐఐటీలో పూర్వ విద్యార్ధి అయిన గంగ్వాల్.. తాను చదువుకున్న విద్యా సంస్థకు విరాళమిచ్చారు. ఈ విషయంపై డైరెక్టర్ అభయ్ కరాండికర్ మాట్లాడుతూ..‘ఐఐటీ కాన్పూర్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు మా పూర్వ విద్యార్ధి, ఇండిగో సహ వ్యవస్థాపకులు రాకేశ్ గంగ్వాల్ వంద కోట్ల వ్యక్తిగత విరాళమిచ్చారు. ఇంత భారీ సహాయానికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మెడికల్ కాలేజీ పూర్తయిన తర్వాత ఆయనను బోర్డులో సలహాదారుడిగా నియమిస్తామ2ని వెల్లడించారు. కాగా, రాబోయే ఐదేళ్లలో పూర్తయ్యే మెడికల్ కాలేజీకి అనుబంధంగా 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, హాస్టళ్లను నిర్మించనున్నారు. అంతేకాక, పరిశోధనల కోసం రీసెర్చ్ సెంటర్లను అందుబాటులోకి తేనున్నారు.