అమెజాన్ ఉద్యోగి కోపం..45 లక్షల నష్టం - MicTv.in - Telugu News
mictv telugu

అమెజాన్ ఉద్యోగి కోపం..45 లక్షల నష్టం

July 14, 2020

worker

ఎవరైనా ఉద్యోగికి తాను పనిచేస్తున్న సంస్థపై కోపం వస్తే ఆ ఉద్యోగానికి టాటా బై బై.. చెప్పేసి వేరే ఉద్యోగం చూసుకుంటారు. కానీ, కొందరు శాడిస్టు ఉద్యోగులు మాత్రం తాము పనిచేస్తున్న సంస్థకు నష్టం కలుగజేస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి అమెరికాలో జరిగింది. ఓ అమెజాన్ సంస్థ ఉద్యోగి ఆగ్రహం కారణంగా ఆ సంస్థకు దాదాపు 60 వేల డాలర్ల(45 లక్షల రూపాయల) నష్టం ఏర్పడింది. 

కోలరాడో రాష్ట్రంలోని థార్న్‌టర్న్ మున్సిపాలిటీలోని అమెజాన్ కేంద్రంలో స్టీవెన్ కోహెన్ అనే ఉద్యోగి కారుతో సహా కంపెనీలోకి దూసుకెళ్లాడు. దీంతో భవనం ముందువైపు ఉన్న తలుపులు ధ్వంసమయ్యాయి. అక్కడితో ఆగకుండా కారును భనవం వెనుకవైపుకు తీసుకెళ్లి అక్కడ కూడా విధ్వంసం సృష్టించాడు. శనివారం రాత్రి ఈ దారుణం జరిగింది. అతడు ఇలా చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. కచ్చితంగా సంస్థలో ఎవరైనా ఉన్నతాధికారితో గొడవ జరిగి ఉంటుందని అంతా భావిస్తున్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.