అరుదుగా జన్మించిన కవలలు.. గ్యాప్ ఎంతుందంటే
కాన్పులో ఒకేసారి ఇద్దరు, ముగ్గరు పిల్లలు పుట్టడం సాధారణంగా జరిగేదే. కానీ, వారు పుట్టినప్పుడు నిమిషాలు, గంటల వ్యవధిలో పుడతారు. కానీ, అమెరికాలో ఓ మహిళకు మూడ్రోజుల గ్యాప్‌తో ఇద్దరు కవలలు పుట్టారు. కార్మెన్ మార్టినెక్స్ అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రిలో జాయిన్ చేశారు. దాంతో మొదట ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత రెండో బిడ్డ డెలివరీ కోసం ప్రయత్నించగా, శిశివు గర్భంలోనే ఉండిపోయింది.
దాంతో విషయం తెలుసుకునేందుకు వైద్యులు స్కానింగ్ చేసి చూడగా, గర్భంలోనే ఉన్నట్టు గుర్తించారు. దీంతో మహిళ ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంది. వివిధ ప్రయత్నాల చేయగా, మూడ్రోజుల తర్వాత రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన కవలలు బరువు తక్కువగా ఉండడంతో ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ ఇచ్చి పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జి చేశారు. మొదటి పాపకు గాబ్రియేలా గ్రేస్ అని, రెండో పాపకు ఇసబెల్లా రోస్ అని పేర్లు పెట్టుకున్నారు. కాగా, వైద్య చరిత్రలో ఇలా మూడ్రోజుల వ్యవధిలో కవలలు జన్మించడం అరుదైన విషయమని వైద్యులు తెలిపారు.