Home > Featured > వెంకన్న స్వామి భక్తులకు విజ్ఞప్తి..అవి వాస్తవాలు కావు

వెంకన్న స్వామి భక్తులకు విజ్ఞప్తి..అవి వాస్తవాలు కావు

An appeal to devotees of Venkanna Swamy..those are not facts

తిరుమల తిరుపతి దేవస్థానం..భక్తులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. కాషన్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, అందుకే భక్తుల ఖాతాల్లోకి డబ్బు ఆలస్యంగా చేరుతోందని జరుగుతున్న ఆ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, అదంతా అవాస్తమని టీటీడీ అధికారులు తెలియజేశారు. దయచేసి భక్తులు అవాస్తవాలను నమ్మొద్దని వేడుకున్నారు. ఆ అవాస్తవాలను ప్రచారం చేసిన..ఎమ్మెల్సీ బీటెక్ రవిపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..గతకొన్ని రోజులుగా తిరుమలలో కాషన్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, భక్తుల ఖాతాల్లోకి డబ్బు ఆలస్యంగా చేరుతోందని దుష్ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ అధికారులు ఈరోజు స్పందించారు. కాషన్ డిపాజిట్ సొమ్మును భక్తుల ఖాతాల్లోకి పంపుతున్నామని, ఈ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేసిన ఎమ్మెల్సీ బీటెక్ రవిపై ఫిర్యాదు చేశామని స్పష్టతనిచ్చారు. అంతేకాదు, నాలుగైదు రోజుల్లో రిఫండ్ అయ్యేలా యూపీఐ విధానం కూడా తీసుకొచ్చినట్టు తెలిపారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు..బీటెక్ రవిపై కేసు నమోదు చేశారు. అయితే, ఆదివారం తిరుమల శ్రీవారిని బీటెక్ రవి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత వసతి గదుల డిపాజిట్ విధానంపై విమర్శలు చేశారు. గతంలో తాను చెల్లించిన రూ. 9,500లు నెలలు గడిచినా తిరిగి ఇవ్వలేదని, ఆ డబ్బును ప్రభుత్వం వాడుకుంటోందని గదుల వద్ద ఉండే సిబ్బంది చెప్పినట్టు ఆయన అన్నారు.

Updated : 29 Aug 2022 8:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top