An aunt who left America with her son-in-law in rajasthan
mictv telugu

దీనమ్మా జీవితం.. అల్లుడితో అమెరికాకి లేచిపోయిన అత్త

January 5, 2023

పిల్లనిచ్చిన అత్త అమెరికాలో ఉంటున్న అల్లుడిపై కన్నేసింది. కూతురు, భర్తకు తెలియకుండా రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపింది. అల్లుడు తన ట్రాప్‌లో పడ్డాడనే నమ్మకం కుదరగానే ప్రేమగా అమెరికా నుంచి ఇంటికి పిలిపించుకుంది. మాంసాహారం పేరుతో తన స్వంత కూతురు, భర్త తినే తిండిలో నిద్రమాత్రలు కలిపి వారు మత్తులో జారగానే అల్లుడిని లేపుకుని అమెరికా వెళ్లిపోయింది. నిద్రలేచిన భర్తకు తన భార్య, అల్లుడు కనపడకపోవడంతో మత్తు వదిలించుకొని పోలీస్ స్టేషన్ బాట పట్టాడు. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో జరిగింది.

వివరాల్లోకెళితే.. రమేష్ అనే వ్యక్తికి భార్యతో పాటు ముగ్గురు కూతుళ్లు ఉండగా అందరికీ పెళ్లిళ్లు చేసేశాడు. చిన్నమ్మాయి కిస్నాను నారాయణ్ జోగి అనే యువకుడికి కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. ఈ నేపథ్యంలో చిన్నల్లుడు నారాయణ్ జోగి మాత్రం అప్పుడప్పుడు అత్తగారింటికి వచ్చేవాడు. ఆ సందర్భంలో మామతో కలిసి మద్యం సేవించేవాడు. రోజులు ఇలా గడుస్తుండగా, కొన్నాళ్లకు నారాయణ్ జోగి తన భార్యను తీసుకొని అమెరికా వెళ్లిపోయాడు. అక్కడ ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం కలిగారు. గతేడాది డిసెంబర్ 30న నారయణ్ జోగి దంపతులు ముగ్గురు పిల్లలను అక్కడే ఉంచి ఇండియాలోని మామగారింటికి వచ్చారు.

చాన్నాళ్ల తర్వాత ఇంటికి వచ్చిన అల్లుడికి ప్రేమగా మద్యంతో పాటు చికెన్, మటన్ వంటి మాంసం కూరలను తెచ్చి భార్యకు వండమని చెప్పాడు. కానీ అప్పటికే అల్లుడితో ప్రేమలో మునిగిన అత్త తన కూతురు, భర్తకు మటన్ వండి అందులో నిద్రమాత్రలు కలిపేసింది. తనకు అల్లుడికి మాత్రం ప్రత్యేకంగా వండిన చికెన్ వడ్డించింది. మాత్రలు కలిపిన మటన్ తిన్న కూతురు, భర్త నిద్రమత్తులో జారుకున్నారు. అదే సరైన సమయం అని భావించిన అత్త అల్లుడిని తీసుకొని అమెరికా చెక్కేసింది. సాయంత్రం 4 గంటలకు మెళకువ వచ్చిన రమేష్ అతని కూతురు కిస్నాలు విషయం గ్రహించగానే నిద్రమత్తు వదిలింది. తనకు ఏమాత్రం అనుమానం రాకుండా ఇద్దరూ ఇంత రహస్యంగా వ్యవహారం నడిపారని గ్రహించని రమేష్.. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన భార్యకి, అల్లుడికి మధ్య 13 ఏళ్ల గ్యాప్ ఉందని, తన భార్య ఇంతపని చేస్తుందనుకోలేదని వారి ముందు వాపోయాడు. దీంతో కేసు రాసుకున్న పోలీసులు నారాయణ్ జోగిని విదేశాల నుంచి రప్పించేందుకు చర్యలు ప్రారంభించారు. వారిద్దరూ ఇండియాకు వచ్చాక కౌన్సిలింగ్ ఇస్తామని భరోసా ఇచ్చారు.