An Elephant Curiously Watching Mobile
mictv telugu

ఏనుగుకు కూడా ఎక్కేసింది..వీడియో వైరల్

November 5, 2022

మొబైల్ ఫోన్ మానవుడి జీవితంలో భాగమైపోయింది. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ పైనా ఆధారపడుతున్నాడు. పిల్లలు నుంచి వృద్ధుల వరకు స్మార్ట్ ఫోన్స్ వాడేస్తున్నారు. ఇప్పడు ఈ ఫోన్‌ను జంతువులకు కూడా అలవాటు చేసేస్తున్నారు. పలు సందర్భాల్లో కోతులు, కుక్కలు వంటి జంతువుల స్మార్ట్ ఫోన్ లను ఆసక్తికరంగా తిలకించడం చూసాం.మొబైల్ ఫోన్ సాంగ్స్‌కు సైతం పలు పెంపుడు జంతువులు స్టెప్స్‌లు వేసిన సందర్భాలున్నాయి. తాజాగా ఓ ఏనుగు స్మార్ట్ ఫోన్ చూడకపోతే ఉండలేకపోతుంది. వైరల్ అవుతున్న వీడియోలను నాకూ చూపెట్టాలని పట్టుబడుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో చక్కెర్లు కొడుతోంది.

ఓ గుడిలో మావటివాడు కూర్చోని ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. అతని పక్కన ఏనుగు నిల్చోని ఉంది. తన యజమాని ఏం చేస్తున్నాడా అని గమనించిన ఏనుగు దృష్టి అతని మొబైల్‌పై పడింది. అందులో వచ్చిన వీడియోలను ఆసక్తిగా తిలకించింది. దూరం నుంచి సరిగ్గా కనిపించకపోవడంతో కాస్త కిందకు వంగీ మరీ మొబైల్‌ను చూస్తూ ఎంజాయ్ చేసింది. ఈ దృశ్యాన్ని అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు మురిసిపోతున్నారు. ఏనుగుకు ఒక మంచి మొబైల్ ఫోన్ ఆర్డర్ పెట్టాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు.