గాలొచ్చి బ్రిడ్జి కూలిపోయింది సార్.. షాకయిన మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

గాలొచ్చి బ్రిడ్జి కూలిపోయింది సార్.. షాకయిన మంత్రి

May 10, 2022

నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయిన ఘటనపై వివరణ అడిగిన మంత్రికి ఓ ఐఏఎస్ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేసింది. ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఇలాంటి కారణం ఎలా చెప్తారంటూ మంత్రి ఆగ్రహించారు. ఈ విషయాన్ని సదరు కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కరీ సోమవారం వెల్లడించారు. వివరాల్లోకెళితే.. బీహార్‌లోని సుల్తాన్ గంజ్‌లో గంగా నదిపై ఓ బ్రిడ్జి కడుతున్నారు.

ఏప్రిల్ 29న బ్రిడ్జిలో కొంతభాగం కూలిపోయింది. దీనిపై సంబంధిత అధికారిని మంత్రి గారు వివరణ అడుగగా, ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆ అధికారి ‘గాలి బలంగా వీయడం వల్ల కూలిపోయింద’ని సమాధానమిచ్చారు. దీంతో మంత్రి ఆశ్చర్యపోయి ‘ఓ ఐఏఎస్ ఆఫీసర్‌గా ఉంటూ ఇలాంటి కారణాలు ఎలా చెప్పగలుగుతున్నారు? గాలి ఎంత బలంగా వీచినా బ్రిడ్జి ఎలా కూలుతుందో నాకు అర్దం కావడం లేదు. నిర్మాణంలో ఏదో లోపం ఉంది. లేదా నాణ్యత విషయంలో రాజీ పడుంటారు’ అని తలంటు పోశారు. ఆ తర్వాత బ్రిడ్జి కూలిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. కాగా, రూ. 1710 కోట్ల వ్యయంతో 3.12 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జిని కడుతున్నారు.