ఊడిపోయిన పురుషాంగం.. 8 ఏళ్ల తర్వాత అతికించారు - MicTv.in - Telugu News
mictv telugu

ఊడిపోయిన పురుషాంగం.. 8 ఏళ్ల తర్వాత అతికించారు

May 3, 2022

విన‌డానికి కాస్త వింత‌గా ఉన్నా ఇది నిజం. బ్రిటన్‌లో ఈ వింత జరిగింది. పెరీనియం అనే ఇన్ఫెక్షన్‌ కారణంగా పురుషాంగాన్ని కోల్పోయిన మాల్కమ్‌ మెక్‌డోనాల్డ్‌ (45) అనే వ్యక్తికి డాక్టర్లు సర్జరీ చేసి, అతనికి మళ్లీ కొత్త జీవితాన్ని ఇచ్చారు. 2014లో తన అంగాన్ని కోల్పోయిన మాల్కమ్‌.. మళ్లీ 8 ఏండ్ల తర్వాత కొత్త అవయాన్ని పొందాడు. గతంలో పెరీనియం భాగం (మలద్వారం, వృషణాలకు మధ్య ఉండే ప్రదేశం)లో ఇన్ఫెక్షన్‌ కారణంగా మాల్కమ్‌కు అతడి కాలి వేళ్లు, చేతుల వేళ్లు, పురుషాంగానికి రక్తసరఫరా తగ్గిపోయి అవి నల్లగా మారిపోయాయి. 2014లో అతడి పురుషాంగం ఊడిపడి.. వృషణాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ ఘటనతో తీవ్ర కుంగుబాటుకు గురైన మాల్క‌మ్ త‌న అవ‌యవం పొంద‌డం కోసం చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.

ఆ ప్ర‌య‌త్నంలో భాగంగానే లండన్ యూనివర్సిటీ కాలేజీ ఆస్పత్రికి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ రాల్ఫ్‌ను సంప్రదించాడు. ఆ డాక్ట‌ర్ త‌న అపార‌మైన అనుభ‌వంతో మొద‌ట‌ అతడి చేతిపై అంగాన్ని మొలిపించి… అది పూర్తిగా పెరిగాక చేతి నుంచి తొలగించి స‌ర్జ‌రీ ద్వారా యథాస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియ మొత్తానికి 2015లో బీజం ప‌డి.. ఎనిమిదేళ్ల కృషి ఫ‌లితంగా 2022 లో స‌ర్జ‌రీ స‌క్సెస్ అయింది. క‌రోనా ప్ర‌భావంలో ఈ స‌ర్జ‌రీకి మ‌రింత స‌మ‌యం ప‌ట్టిందంటున్నారు డాక్ట‌ర్లు. అయితే ఈ స‌ర్జ‌రీకి అయిన మొత్తం ఖ‌ర్చు.. 50 వేల పౌండ్లు అంటే దాదాపు అర‌కోటి (రూ.48 లక్షలు)