భారీ భూకంపం ఎఫెక్ట్ నుంచి ఇంకా బయటపడకముందే సిరియాపై మరో దాడి జరిగింది. ఆదివారం తెల్లవారుజామున సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 15 మంది మరణించారని, పలువురు గాయపడ్డారని డమాస్కస్ పోలీసు కమాండ్‌లోని ఒక మూలాన్ని ఉటంకిస్తూ సిరియన్ స్టేట్ మీడియా ఏజెన్సీ సనా తెలిపింది.
#كفرسوسة ب #دمشق بعيد تعرضها لعدوان اسرائيلي وأنباء عن استشهاد مدنيين اثنين.#سورية pic.twitter.com/P51CqLbcFa
— خالد اسكيف (@khalediskef) February 18, 2023
సిరియా రాజధానిలోని కాఫర్ సౌసా పరిసరాల్లో జరిగిన దాడిలో నలుగురు పౌరులు, ఒక సైనికుడు మరణించారని, మరో 15 మంది పౌరులు గాయపడ్డారని సైనిక మూలాన్ని ఉటంకిస్తూ సనా తెలిపింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. కాగా కొన్ని సిరియన్ మీడియా నివేదికలు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. వైమానిక దాడిలో కాఫర్ సౌసాలోని అనేక నివాస భవనాలకు కూడా భారీ నష్టం వాటిల్లిందని సనా తెలిపింది.