హోటల్ కి వెళ్లి కడుపునిండా తిన్న తర్వాత డబ్బులు లేవని చెప్తే ఏం చేస్తారు? పప్పు రుబ్బడమో, ఎంగిలి ప్లేట్లు కడిగించడమో చేస్తారు. సినిమాల్లో ఇలాంటి సీన్లు చూసి నవ్వుకున్నాం కానీ, నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.
హోటల్ కాదు కానీ, ఆహారం కోసం తెలియని పెళ్లికి వెళ్లిన ఓ ఎంబీఏ విద్యార్ధి అక్కడి విందు భోజనాన్ని సుష్టుగా తినేశాడు. తర్వాత పెళ్లివారు ఆరా తీయగా, మొదట బుకాయించి తర్వాత అడ్డంగా దొరికిపోయాడు. దీంతో కడుపు నిండా తిన్నందుకు చేతి నిండా పని చేయాలని ఎంగిలి ప్లేట్లు, పాత్రలను దగ్గరుండి కడిగించారు. అదే సమయంలో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొన్ని సార్లు వధువు ప్రియులు ఇలాంటి వేషాల్లో పెళ్లికి వచ్చి చెడగొడుతుంటారని చెప్తుండగా, మరి కొందరు పాపమంటూ జాలి చూపిస్తున్నారు. ఎంబీఏ చదువుకున్న యువకుడు ఆహారం కోసం వచ్చాడంటే అతని పరిస్థితి అర్ధం చేసుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. తాము కూడా చాలా సార్లు ఇలా పిలవని పెళ్లికి వెళ్లి తిన్నామని, అదో సరదా అంటూ గతానుభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
#ViralVideo: MBA student gatecrashes wedding in Madhya Pradesh, forced to wash utensils
Stay tuned to https://t.co/5s7rsFo3Gc for more updates.#MadhyaPradesh #MBA #student #utensils #wedding #Invitation #TrendingNews #TrendingNow #Viral pic.twitter.com/qs6HlhW2hA
— APN NEWS (@apnnewsindia) December 1, 2022