పట్టాల్లో ఇరుక్కున్న వీల్‌చైర్.. దూసుకొచ్చిన రైలు  (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పట్టాల్లో ఇరుక్కున్న వీల్‌చైర్.. దూసుకొచ్చిన రైలు  (వీడియో)

August 13, 2020

ఓ నడవలేని వృద్ధుడు వీల్ చైర్‌లో కూర్చుని దానిని తోసుకుంటూ రైలు పట్టాలు దాటుతున్నాడు. ఇంతలో అనుకోకుండా వీలు చైరు టైరు ఒకటి పట్టాల మధ్యలో ఇరుక్కుంది. దీంతో ఆయన పాపం చాలా ఆపసోపాలు పడ్డాడు. మరోవైపు రైలు వేగంగా దూసుకువస్తోంది. దీంతో ఆయన గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. రైలు వచ్చి గుద్దిందంటే ఇక తన పని అయిపోయిందనుకున్నాడు. ఇంతలో ఓ పోలీస్ అధికారిణి ఆపద్బంధవిలా వచ్చి వెంట్రుకవాసిలో కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఓ 66ఏళ్ల వృద్ధడు వీల్‌చైర్‌పై కూర్చొని ఒంటరిగా రోడ్డుపై ఉన్న రైలుపట్టాలు దాటుతున్నాడు. ఇంతలో ఆయన కుర్చీ పట్టాలపై ఇరుక్కుంది. దీంతో సదరు వృద్ధడు రైలు పట్టాలు దాటడానికి ఏం చెయ్యలేక టెన్షన్ పడుతున్నాడు. నిస్సహాయంగా రైలు రూపంలో ముంచుకొస్తున్న మృత్యువును చూసి హడలిపోతున్నాడు. అప్పుడే ఓ మహిళా పోలీసు అధికారి దేవతలా అక్కడికి వచ్చింది. సదరు వృద్ధుడిని పట్టాలపై నుంచి పక్కకు లాగి, ఆయన ప్రాణాలను కాపాడింది. అప్పుడే రైలు దూసుకెళ్లింది. క్షణం ఆలస్యం అయినా తన ప్రాణాలు పోయేవని బాధితుడు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా, ఇందుకు సంబంధించిన దృశ్యాలు పోలీసు అధికారి వద్ద ఉన్న కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోను పోలీసు అధికారులు ట్విటర్‌లో పంచుకోవడంతో ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.