An old man hanging upside down at a height of 150 feet in china
mictv telugu

150 ఫీట్ల ఎత్తులో తలకిందులుగా వేలాడిన వృద్ధుడు.. ట్విస్ట్ ఏంటో వీడియోలో చూడండి

November 6, 2022

ప్రాణాల మీద ఆశలు వదులుకున్న కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు జరుగుతుంటాయి. విధిరాత మరోలా ఉండి ప్రాణాలు దక్కుతాయి. ఈ తరహా ఘటనలు సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంటాయి. తాజాగా చైనాలో ఇలాంటి ఘటన జరిగింది. ఓ 85 ఏళ్ళ వృద్ధుడు తన కుమార్తెతో కలిసి ఓ అపార్టుమెంటులో నివసిస్తున్నాడు. ఈయనకు ఇటీవలే బ్రెయిన్ సర్జరీ జరగ్గా, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు ప్రమాదవశాత్తూ కిటికీ నుంచి జారి పడిపోబోయాడు. అదృష్టవశాత్తూ కాలు కిటికీలో ఇరుక్కుపోవడంతో కింద పడిపోకుండా తల కిందులుగా వేలాడబడ్డాడు.

వృద్ధుడు ఉంటున్న ఇల్లు 150 అడుగుల ఎత్తులో ఉండడం గమనార్హం. ఓ యువతి షాపింగుకి వెళ్తూ తలకిందులుగా వేలాడుతున్న వృద్ధుడిని చూసి షాకై వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంటుకి సమాచారం ఇచ్చింది. దాంతో పాటు అక్కడే ఉన్న కొంతమంది యువకులకు విషయం తెలియజేయగా, వారంతా పరిగెత్తుకు వెళ్లి వృద్ధుడి కాలుకు షీట్ కట్టి జాగ్రత్తగా పట్టుకున్నారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని వృద్ధుడిని రక్షించారు. విషయం తెలిసిన ఆయన కూతురు తండ్రిని కాపాడిన వారందరికీ థ్యాంక్స్ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.