మద్యం మత్తులో సెక్స్ చేస్తూ చనిపోయిన వృద్ధుడు - MicTv.in - Telugu News
mictv telugu

మద్యం మత్తులో సెక్స్ చేస్తూ చనిపోయిన వృద్ధుడు

May 24, 2022

ఒక సందర్భంలో ఒకే పని చేయాలి లేదంటే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఓ వృద్ధుడు చేసిన అత్యుత్సాహపు పని అతని ప్రాణాల మీదకు తెచ్చింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలోని ఓ హోటల్ గదిలో ఓ వృద్ధుడు (66) రూం తీసుకున్నాడు. పార్టీ చేసుకుందామని మందు, ఫుడ్డు తెచ్చుకున్నాడు. కొంత తాగాక మగువ కావాలనిపించింది. ముంబైలో ఇలాంటి వాటికి కొదవ ఉండదు కదా. కోరుకున్న వెంటనే కావాలనుకున్న సౌకర్యాలు నడుచుకుంటే వస్తాయి. దాంతో మగువ కూడా వెంటనే దొరికేసింది. ఇంకేముంది, ఇద్దరూ కలిసి సెక్స్‌లో పాల్గొంటుండగా, మనోడికి మందు తాగాలనిపించింది. అనుకుందే తడవుగా మందు బాటిల్ ఎత్తుకొని సిప్ చేస్తుండగా, ఆయాసంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఈ విషయాన్ని సదరు మహిళ (40) హోటల్ రిసెప్షన్‌కు ఫోన్ చేసి చెప్పగా, వారు పోలీసులకు సమాచారమిచ్చి పిలిపించారు. పోలీసులు వచ్చి ప్రశ్నించగా సదరు మహిళ పై విషయాన్నే వివరించింది. విచారణలో వృద్ధుడు వర్లి ప్రాంతంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడని తేలింది. మహిళ గురించి విచారించగా, వృద్ధుడు ఉంటున్న అపార్ట్‌మెంటులో పనిమనిషి అని తేలింది. వాళ్లిద్దరి మధ్య ఎప్పటినుంచో అక్రమ సంబంధం ఉండగా, అపార్ట్‌మెంటులో కలవడం వీలు పడదని ఇలా హోటల్‌కు వచ్చి ఎంజాయి చేస్తారంట. ఇలా ఇంతకు ముందు కూడా అనేక సార్లు చేశారంట. అయితే మహిళ చెప్పింది నిజమా? కాదా? అనే విషయం పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే కానీ తెలియదు. ప్రస్తుతం పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని ఆ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు.