An unprecedented welcome to the Kakatiya heir in warangal
mictv telugu

కాకతీయ వారసుడికి అపూర్వ స్వాగతం.. భద్రకాళీ ఆలయంలో పూజలు

July 7, 2022

An unprecedented welcome to the Kakatiya heir in warangal

వరంగల్ కేంద్రంగా విరాజిల్లిన కాకతీయ సామ్రాజ్యం వారసుడు గురువారం నగరంలో అడుగుపెట్టారు. ఇప్పటి చత్తీస్‌గఢ్‌లో ఉంటున్న కమల్ చంద్ర భంజ్ దేవ్‌కు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నరేందర్‌లు ఘన స్వాగతం పలికారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. అనంతరం అందరూ కలిసి భద్రకాళీ ఆలయంలో పూజలు చేశారు. తర్వాత వేయి స్థంబాల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ఉత్సవాల్లో భాగంగా ఏడు రోజుల పాటు నాటకాలు, సదస్సులు, విద్యార్ధులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా, తమ పూర్వీకుల రాజ వంశ వారసుడిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.