An unwilling marriage, a young woman who went with her boyfriend...an unexpected accident at the end
mictv telugu

ఇష్టం లేని పెళ్లి, ప్రియుడితో వెళ్లిన యువతి..ఊహించని ప్రమాదం

August 25, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువతికి తల్లిదండ్రులు, పెద్దలు కలిసి నిర్ణయించిన పెళ్లి ఇష్టం లేక తాను ప్రేమించిన ప్రియుడుతో బతకడానికి సిద్దమై, ఇద్దరు కలిసి బైక్‌పై వెళ్తుండగా ఊహించని రీతిలో ప్రమాదం జరిగి, ప్రియుడు అక్కడికక్కడే మృతి చెందగా, యువతికి తీవ్రగాయాలైన సంఘటన కృష్ణా జిల్లా వీరవల్లిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ”అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరానికి చెందిన సారపు పోతురాజు (22) చేబ్రోలు సమీపంలోని ఓ స్పిన్నింగు మిల్లులో పనిచేస్తున్నాడు. ఈ సమయంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి, అదికాస్త ప్రేమకు దారి తీసింది. దాంతో యువతి కుటుంబ సభ్యులు ఈ నెల 18న ఆమెకు వేరే వ్యక్తితో వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ పెళ్లి ఇష్టం లేక ఆమె ఇంట్లోంచి వచ్చేసింది. ఈ క్రమంలో ఇద్దరు బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది”అని పోలీసులు తెలిపారు.