భారత్‌కు అచ్చిరాని అనకొండలు.. మరొకటి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌కు అచ్చిరాని అనకొండలు.. మరొకటి మృతి

November 24, 2019

Anaconda died in Thiruvananthapuram zoo

దక్షిణ అమెరికాలో కనిపించే భారీ సర్పాలు అనకొండలు భారత్‌కు అచ్చిరావడం లేదు. జూలలో పెట్టి ఎంత సంరక్షించినా బతికి బట్టకట్టలేకపోతున్నాయి. కేరళ రాజధాని తిరువనంతపురంలోని జూలో మరో అనకొండ చనిపోయింది. జూలో అనకొండ చనిపోవడం ఇది మూడోసారి. 

అరుంధతి అనే ఆనకొండ బ్యాక్టీరియాతో చనిపోయినట్లు జూ అధికారులు తెలిపారు. ఎంటమోబియా అనే బ్యాక్టీరియా అనకొండలకు ముప్పుగా మారిందన్నారు. ఇటీవల ఇదే జూలోని ఏంజెలా అనే మగ అనకొండ కూడా చనిపోయింది. ఆడదానితో జతకట్టే సమయంలో తీవ్రగాయమై ప్రాణం కోల్పోయింది. 2017లో శ్రీలంక ప్రభుత్వం తిరువనంతపురం జూకు మొత్తం ఏడు గ్రీన్ అనకొండలను అందజేసింది. అవన్నీ ఆడవే అనుకున్నారు. అయితే వాటిలో రెండు మగవి అని తర్వాత తేలింది. ప్రస్తుతం మ్యూజియంలో ఒక మగ, మూడు ఆడ అనకొండలు ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణ భారతంలో కేవలం ఈ జూలో మాత్రమే అనకొండలు ఉన్నాయి. కొన్నేళ్ల కిందట మైసూరు జూలోని అనకొండ వెన్నెముక సమస్యతో చనిపోయింది.