తదుపరి పీఎంగా అతడొద్దు... అమిత్ షాకు కేఏ పాల్ సలహా.. పాల్‌కు నచ్చని ఆ మనిషి ఎవరు? - MicTv.in - Telugu News
mictv telugu

తదుపరి పీఎంగా అతడొద్దు… అమిత్ షాకు కేఏ పాల్ సలహా.. పాల్‌కు నచ్చని ఆ మనిషి ఎవరు?

May 24, 2022

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇటీవల ఓ ఛానెల్‌లో అన్ని విషయాలపై మనసు విప్పి తన అభిప్రాయాలను వెల్లడించారు. అవతల ఉన్న ప్రముఖ యాంకర్ కూడా మంచి ప్రశ్నలు వేయడంతో ఈ షో జనాలకు ఆకట్టుకుంది. ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేఏ పాల్ గత వారంలో అమిత్ షాను కలిసి మాట్లాడిన విషయాన్ని వెల్లడించారు. హొం మంత్రితో భేటీ సందర్భంగా ఏం మాట్లాడారనే ప్రశ్నకు కేఏ పాల్ సమాధానమిస్తూ.. తర్వాత ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఎవరు పీఎం కాకూడదో చెప్పానని వ్యాఖ్యానించారు.

మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ లేదా వేరే ఎవరయినా ప్రధానిని చేయండి కానీ, ఒక్క మనిషిని మాత్రం ప్రధాని అవకాశం ఇవ్వవద్దు అని ఆ వ్యక్తి పేరు చెప్పి రిక్వెస్ట్ చేశానని చెప్పుకొచ్చారు. ఎవరా వ్యక్తి అంటే పేరు బయటికి చెప్పనని దాటవేశారు. అయితే తదుపరి ప్రధానిగా బీజేపీ గెలిస్తే తిరిగి మోదీనే ఉంటారని అమిత్ షా తెగేసి చెప్పేశారు. ఆ పార్టీలో పెట్టుకున్న వయసు నిబంధన కూడా మోదీకి మినహాయింపు అనే చర్చ జరుగుతోంది. సరే, ఈ అంశం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమనుకున్నా ఇంతకీ ప్రధాని పదవి ఇవ్వవద్దని పాల్ చెప్పిన వ్యక్తి ఎవరనే సందేహం ఆ షో చూసిన వ్యక్తులకు రాకమానదు. మెజారిటీ వ్యక్తుల అభిప్రాయాలు, విశ్లేషకుల ప్రకారం ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అని చెప్పుకుంటున్నారు.

కట్టర్ హిందూ రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న యోగీ కనుక ప్రధాని అయితే యూపీ లాంటి పరిస్థితులు దేశ వ్యాప్తంగా నెలకొంటాయన్న ఆందోళన పాల్‌లో కనిపించిందని ఉవాచ. కానీ, మోదీ తర్వాత ప్రధాని అయ్యే అవకాశాలు ఆ పార్టీలో ఇద్దరికే ఉన్నాయని చెప్పవచ్చు. ఒకరు అమిత్ షా అయితే మరొకరు యోగీజీ. మోదీ షా ద్వయంలాగా తదుపరి తరంలో యోగీ, అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మలను ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ప్రొజెక్ట్ చేస్తోంది. వీళ్లను కాదని పాల్ చెప్పుకొచ్చిన రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలను ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.