Analysts say that Pakistan will win the T20 World Cup
mictv telugu

1992 సీన్ రిపీట్.. పాకిస్తానే టీ20 విజేత!

November 10, 2022

Analysts say that Pakistan will win the T20 World Cup

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ చివరి అంకానికి చేరుకుంది. రెండో సెమీస్ మ్యాచులో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధించడంతో నవంబర్ 13న పాకిస్తాన్ – ఇంగ్లండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఫైనల్ మ్యాచ్ జరుగకముందే క్రీడా పండితులు విజేత ఎవరో చెప్పేస్తున్నారు. కచ్చితంగా పాకిస్తాన్ టైటిల్ ఎగరేసుకుపోతుందని ఆధారాలతో సహా చెప్తున్నారు. ఇందుకు 1992 వన్డే ప్రపంచ కప్ టోర్నమెంటుని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇది చూస్తే వారు చెప్పింది నిజమేననిపిస్తోంది. ఎందుకంటే యాధృచ్చికమో ఏమో తెలియదు కానీ, 1992 సీన్ ఇప్పుడు రిపీటయింది. అప్పుడు పాక్ జట్టును ఇమ్రాన్ ఖాన్ నడిపించగా, మెల్ బోర్న్ వేదికగా జరిగిన మొదటి మ్యాచులో పాక్ టీమిండియాపై ఓడిపోయింది. ఇప్పుడు కూడా తొలి మ్యాచులో పాక్ భారత జట్టు చేతిలో అదే వేదికపై ఓటమి చవి చూసింది. తర్వాత ఇంటిబాట పట్టాల్సిన సమయంలో ఆఖరి రెండు మ్యాచులలో విజయం ద్వారా ఒక్కపాయింట్ ఎక్కువ ఉన్న కారణంగా సెమీస్‌కు రావడం, సెమీస్‌‌లో న్యూజిలాండ్‌‌ని ఓడించి ఫైనల్ వెళ్లడం జరిగింది.

ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి విజేతగా నిలిచింది. తాజా ప్రపంచకప్‌లో కూడా మొదటి మ్యాచ్ ఓడిపోయిన పాకిస్తాన్.. అనూహ్యంగా పుంజుకొని బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై విజయం సాధించింది. తర్వాత నెదర్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో అదే ఒక్కపాయింట్ ఎక్కువ ఉన్న కారణంగా సెమీస్‌కు చేరి న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్ వరకు వెళ్లింది. 1992లాగే ఇప్పుడు కూడా ఫైనల్ ప్రత్యర్ధి ఇంగ్లండే. దీంతో పాక్ విజయం ఖాయమని జోస్యం చెప్తున్నారు. అయితే కొందరు దీనిని కొట్టిపారేస్తున్నారు. వన్డేకి, టీ20కి చాలా తేడా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. పొట్టి ఫార్మాట్‌‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, ఒక్క ఓవర్ లేదా ఒక్క పరుగు మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తుందని ఉదహరిస్తున్నారు. అలాగే ఇంగ్లండ్ ఇప్పుడున్న ఫామ్ చూస్తే పాక్ గెలవడం చాలా కష్టమని భావిస్తున్నారు. మరి ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.