మాయావతి బ్రదర్‌కు షాక్.. రూ.400 కోట్ల ఆస్తి జప్తు.. - MicTv.in - Telugu News
mictv telugu

మాయావతి బ్రదర్‌కు షాక్.. రూ.400 కోట్ల ఆస్తి జప్తు..

July 18, 2019

Anand Kumar, Maya's Brother

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్‌ చిక్కుల్లో పడ్డారు. ఆనంద్‌కు చెందిన 400 కోట్ల రూపాయల విలువచేసే ఏడు ఎకరాల భూమిని ఐటీశాఖ జప్తు చేసింది. ఇది బినామా ఆస్తి అనే ఆరోపణలు ఉన్నాయి. జులై 16న ఐటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన బినామీ నిరోధక శాఖ ఉత్తర్వులు జారీ చేసి, ఇవాళ అమలు చేశారు. ఆనంద్. ఆయన భార్య విచితర్ లత పేరు మీద ఢిల్లీ, నోయిడా పరిధిలో ఆస్తులు వున్నట్టు తేల్చింది. ఈమేరకు వాటిని కూడా జప్తు చేసింది. ఆనంద్ కుమార్ నోయిడా అథారిటీలో క్లర్క్ స్థాయి నుంచి పెద్ద వ్యాపారవేత్తగా.. ఆపై బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా ఎదిగారు. 

ఆనంద్ తన సోదరి సీఎంగా ఉండగా రూ.1,316 కోట్ల విలువ చేసే ఆస్తులు సంపాదించుకున్నారని సమాచారం.  2007లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 49 కంపెనీలు ప్రారంభించారు. నకిలీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయల రుణాలు పొందినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కాగా, ఆనంద్ కుమార్ గత జూన్‌లో బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన విషయం తెలిసిందే.