సుడిగాళ్లు.. పేర్లు పెట్టి కార్లు కొట్టేశారు..  - MicTv.in - Telugu News
mictv telugu

సుడిగాళ్లు.. పేర్లు పెట్టి కార్లు కొట్టేశారు.. 

September 19, 2019

 

పేర్లు పెట్టండి క్యాష్ కొట్టండి అని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఇచ్చిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. ఆయన ప్రకటించినట్టుగానే పేర్లు పెట్టిన ఇద్దరికి కార్లు బహూకరిస్తానని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇంతకీ ఆయన ఏం ప్రకటించారంటే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా వుండే ఆయన సామాజిక సేవా కార్యక్రమాలపై ట్విటర్ వేదికగా స్పందించి సహకరిస్తారు. ఈసారి అయన సరదాగా ఓ పోటీ పెట్టారు. అయన ట్విటర్‌లో ఓ ఫోటో పెట్టి దానికి క్యాప్షన్ ఇవ్వాల్సిందిగా కోరారు.

హిందీ, ఇంగ్లీష్ లేదా హింగ్లీష్‌లో క్యాప్షన్ ఇవ్వమన్నారు. సరైన క్యాప్షన్ ఇచ్చినవారికి మహీంద్రా కారు బహుమతిగా ఇస్తామని వెల్లడించారు. ఆయన పోస్టుకు ఊహించని విధంగా  స్పందన వచ్చింది. చాలామంది నెటిజన్లు పోటీలుపడి మరీ తమ సమాధానాలు పంపించారు. వాటిలో రెండు క్యాప్షన్స్‌ను ఆనంద్ మహీంద్ర ఎన్నుకున్నారు. ప్రకటించినట్టుగానే ఆ కాప్షన్స్ రాసిన ఇద్దరికి బహుమతి ఇవ్వనున్నట్టు అయన ట్వీట్ చేశారు. వాటిలో ఓ కాప్షన్‌ను రాకేశ్ రాశారు. బస్సు మీద బస్సు తిరగబడి ఉన్నట్టుగా ఉన్న ఆ ఫోటోకు రాకేశ్‌ ‘సబ్‌ కీ బస్’(SUB की BUS)‌, భూపేశ్‌ ‘హ్యాంగోవర్ బస్‌‌’(Hangover Bus) అని రాశారు. ఇవి రెండు ఆయనను బాగా ఆకర్షించాయి. BUS అనే పదాన్ని ఫోటోకి అన్వయిస్తూ రాసిన విధానం బావుందని రాకేశ్‌కి మెచ్చుకున్నారు. త్వరలోనే వారికి బహుమతి ప్రధానం వుంటుందని తెలిపారు. దీంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.